సామ్ జీవితంలోకి కొత్త అతిథి… ఇబ్బందే అంటోన్న బ్యూటీ !

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది, ఆ పిక్స్ చూస్తుంటే సామ్ తన జీవితంలోకి కొత్త అతిథిని ఆహ్వానించినట్టు అన్పిస్తోంది. తాజాగా సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులకు తన కొత్త కుక్కను పరిచయం చేసింది. దానికి సాషా అని పేరు పెట్టింది. మరో కుక్క హ్యాష్ కూడా ఆ పిక్స్ లో కన్పిస్తోంది. ఈ రెండు కుక్కలను సామ్ పెంచుకుంటోంది. అయితే ఈ కొత్త అతిథి తనను బాగా ఇబ్బంది పెడుతోందని సామ్ చెప్పుకొచ్చింది. సమంత ఈ ఉదయం నుండి సాషా మూత్రాన్ని 19 సార్లు శుభ్రం చేశానని, సాషా ప్రశాంతంగా ఒక కప్పు కాఫీ కూడా తాగనివ్వడం లేదని రాసుకొచ్చింది. ఆ పోస్ట్ కు సామ్ #HashandSaasha #brotherandsister #its goingtobeaparty అనే హ్యాష్‌ ట్యాగ్‌లను జోడించింది. ఈ పోస్ట్ కు పలువురు ప్రముఖులు కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సమంత గుణశేఖర్ పౌరాణిక డ్రామా “శాకుంతలం”లో నటిస్తోంది.

View this post on Instagram

A post shared by S (@samantharuthprabhuoffl)

Related Articles

Latest Articles

-Advertisement-