బుట్టబొమ్మను వదలని త్రివిక్రమ్.. ముచ్చటగా మూడోసారి కూడా..?

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ కాంబోలో మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబో ఒకటి. అతడు, ఖలేజా తరువాత హైట్రిక్ సినిమాతో మహేష్- త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది ఈ సినిమాలో మహేష్ సరసన సమంత ఛాన్స్ కొట్టేసింది అంటుండగా.. మరికొంతమంది బుట్ట బొమ్మ పూజ హెగ్డే ని ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పూజానే కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా “అరవింద సమేత, అల వైకుంఠపురంలో” నటించింది. ఇక ఈ ప్రాజెక్ట్ కూడా ఒకే అయితే పూజా తో ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ పనిచేస్తున్నట్లు లెక్క.  పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పూజా హీరోయిన్ అయితే ఇంకా ఈ సినిమాపై అంచనాలు ఇంకా రెట్టింపు అవుతాయి. ఫిబ్రవరిలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి హీరోయిన్ ని అధికారికంగా మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

Related Articles

Latest Articles