మరోసారి ఫ్యాన్స్ కు సామ్ షాక్… దీని కోసమే ఇదంతా చేసిందా ?

సౌత్ స్టార్ సమంత ఈరోజు బిగ్ అనౌన్స్మెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సామ్ గ్లోబల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ‘డౌన్‌టౌన్ అబ్బే’ ఫేమ్‌కు బాఫ్టా-విజేత చిత్రనిర్మాత ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించే ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’తో ఈ నటి అంతర్జాతీయ చలనచిత్ర రంగ ప్రవేశం చేయనుంది. జాన్‌తో ఉన్న ఫోటోను పంచుకుంటూ సమంత “ఒక సరికొత్త ప్రపంచం! నేను చివరిసారిగా 2009లో ‘ఏ మాయ చేశావే’ కోసం ఆడిషన్ చేశాను. 12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆడిషన్‌కు వెళ్లినప్పుడు, నేను అదే భయాన్ని అనుభవించాను. మీరు BAFTA అవార్డు-గెలుచుకున్న, విమర్శకుల ప్రశంసలు పొందిన, ఆడిషన్‌కు వచ్చే ప్రతి రోజు ఇది కాదని నేను ఊహిస్తున్నాను. మీరు నన్ను ఎన్నుకున్నందుకు ఆనందంతో గెంతులేస్తున్నాను సార్. ఫిలిప్ జాన్, సునీత, గురు ఫిలిమ్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్ జాయిన్ అవ్వడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా” అంటూ తన ఎగ్జైట్మెంట్ ను పంచుకుంది.

Read Also : సామ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీ

ఫ్యాన్స్ కు షాక్ నెక్స్ట్ లెవెల్ లో…
ఈ సినిమాతో సామ్ ఇచ్చే షాక్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతోంది అంటున్నారు. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ భారతీయ రచయిత టైమెరి ఎన్. మురారి రాసిన నవల. 2004లో అత్యధికంగా అమ్ముడైన ఈ నవలకి అనుసరణగా కొత్త ప్రాజెక్ట్ రూపొందబోతోందని మేకర్స్ ప్రకటించారు. దీని ప్రకారం సమంతా తన స్వంత డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతూ శోధనలో భాగమైన 27 ఏళ్ల ప్రోగ్రెసివ్ ద్విలింగ తమిళ యువతి, దృఢమైన మనస్సు ఉన్న ఫన్నీ అమ్మాయిగా పవర్ ఫుల్ రోల్ పోషించబోతోంది. కానీ ఈ మూవీ అసలే ఇంటర్నేషనల్ అంటున్నారు, పైగా ఇందులో సమంత రోల్ బైసెక్సువల్ అంటున్నారు. మరి సమంత ఎక్స్పోజింగ్, రొమాంటిక్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో ? అని ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు ప్రేక్షకులు. కొన్ని నెలల క్రితం విడుదలైన “ఫ్యామిలీ మ్యాన్-2″లో సామ్ చేసిన సన్నివేశాలను బట్టి చూస్తే ఈ సినిమాలో సమంత మరింతగా రెచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది నిజంగా ఆమె అభిమానులకు షాకిచ్చే విషయమనే చెప్పాలి.

దీని కోసమేనా ఇంత చేసిందా ?
చైతో విడిపోయిన వెంటనే సామ్ ఎక్స్పోజింగ్ చేస్తూ ఫోటోషూట్లు చేయడం, పైగా ‘పుష్ప’లో ఐటెం సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారింది. అయితే సమంతా ఇదంతా చేసింది ఈ ప్రాజెక్ట్ కోసమే అన్నమాట. అంటే ఇంటెర్నేషనల్ లెవెల్లో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో పడింది సామ్. మరి గ్లోబల్ స్టార్ గా రాణించాలంటే ఆ మాత్రం చేయాల్సిందే కదా !

Related Articles

Latest Articles