‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కు సమంత!

ఎన్టీయార్ నిర్వహిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో నిదానంగా ఫిల్మ్ స్టార్స్ పార్టిసిపేషన్ తో మరింత కలర్ ఫుల్ కాబోతోంది. తాజాగా ఈ షోకు ప్రిన్స్ మహేశ్ బాబు హాజరయ్యాడన్నది తెలిసిందే. మహేశ్ బాబు ఈ గేమ్ లో పాల్గొని ఎంత మొత్తం గెలుచుకున్నాడో తెలియదు కానీ, ఆ ఎపిసోడ్ ప్రసారం కాకముందే, సమంత సైతం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’కు హాజరైందనేది రూఢీ అయ్యింది. ఆమె మేనేజర్ మహేంద్రతో కలిసి ఈ కార్యక్రమంలో అందుకున్న చెక్ ను చూపిస్తూ సమంత ఓ ఫోటో దిగింది. ఇప్పుడా ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీయార్, సమంత జంటగా ఇంతవరకూ నాలుగు సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో తొలి చిత్రంగా ‘బృందావనం’ రూపుదిద్దుకుంది. ఆ తర్వాత ‘రామయ్యా వస్తావయ్యా, రభస, జనతా గ్యారేజ్ ‘ చిత్రాలు వచ్చాయి. సో… ఎన్టీయార్ కు, సమంతకు మధ్య చక్కటి కెమిస్ట్రీ ఉందనే అభిమానులంతా భావిస్తుంటారు. ఇక ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి సమంత హాజరయినప్పుడు వారి మధ్య సంభాషణ ఏ విధంగా సాగి ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా విడాకులకు సంబంధించి సమంత ఓ క్లారిటీకి వచ్చేసిన తర్వాత జరిగిన ఈ షో లో చైతు – సమ్ము అనుబంధం గురించి ఎన్టీయార్ ఏమైనా ప్రశ్నలు అడిగారో లేదో తెలియదు కానీ, ఈ షో టీఆర్పీ మాత్రం సూపర్ గా పెరిగే ఛాన్స్ ఉంది.

'ఎవరు మీలో కోటీశ్వరులు' షో కు సమంత!

-Advertisement-'ఎవరు మీలో కోటీశ్వరులు' షో కు సమంత!

Related Articles

Latest Articles