సామ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీ

సమంత అభిమానులకు గుడ్ న్యూస్… సామ్ ఓ ఇంటర్నేషనల్ మూవీకి సైన్ చేసింది. అన్ని అడ్డంకులు, సరిహద్దులను చెరిపేసేందుకు మరో ప్లాన్ వేసింది. సౌత్ లో పాపులర్ అయిన సామ్ అందరికీ షాకిస్తూ బాలీవుడ్ బడా హీరోయిన్లకు సైతం దొరకని అవకాశాన్ని పట్టేసింది. తాజాగా సమంతా తన తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. ఆ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గతంలో ‘డోంటన్ అబ్బే’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఫిలిప్ జాన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆసక్తికరంగా ఈ చిత్రంలో సామ్ 27 ఏళ్ల ద్విలింగ మహిళగా బోల్డ్ పాత్రలో కనిపించనుంది. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌’ను సునీతా తాటి ప్రొడక్షన్ హౌస్ గురు ఫిల్మ్స్ నిర్మిస్తుంది. సమంత ‘ఓ బేబీ’ సినిమాని సహ-నిర్మించిన బ్యానర్ ఇది! ఈ చిత్రం తారాగణం, సిబ్బంది, షూటింగ్ ఫార్మాలిటీస్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఈ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్‌తో పాటు సమంతకు టాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా రెండు సినిమాలు ఉన్నాయి. ఆమె బాలీవుడ్ డెబ్యూ కోసం చర్చలు కూడా జరుపుతోంది.

Read Also : స్మృతీ ఇరానీకి చేదు అనుభవం… అతిథిగా ఆహ్వానించిన షోకే ‘నో ఎంట్రీ’

టైమేరి మురారి రచించిన బెస్ట్ సెల్లింగ్ నవల ‘అరేంజ్‌మెంట్ ఆఫ్ లవ్‌’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాఫ్టా-విజేత ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించడం ఆసక్తికరంగా మారింది. ఫిలిప్ జాన్, సునీతతో కలిసి పని చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సమంత “నా పాత్ర సంక్లిష్టమైన పాత్ర… దానిని పోషించడం నాకు ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఆతృతగా వేచి చూస్తున్నాను” అంటూ ట్వీట్ చేసింది.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Related Articles

Latest Articles