నయన్ అందం… సమంత మనసు దోచేసిందట!

‘మోస్ట్ డిజాయరబుల్ ఉమన్’గా మరోమారు సత్తా చాటింది గార్జియస్ గాడెస్ సమంత. మిసెస్ అయ్యాక సామ్ హైద్రాబాద్ కి మకాం మార్చినా కూడా చెన్నై ఫ్యాన్స్ ఆమెని మిస్ అవ్వటం లేదు. చెన్నైలో ఆమె ఇప్పటికీ నంబర్ డిజాయరబుల్ ఉమన్. అయితే, తనకు అంత క్రేజ్ ఉన్నా కూడా మన తమిళ పొన్ను కేరళ కుట్టీ నయనతారే హాట్ అంటోంది! సామ్ దృష్టిలో లేడీ సూపర్ స్టారే మోస్ట్ డిజాయరబుల్ అట!

ఇప్పుడే కాదు గతంలోనూ నయన్ సూపర్ అంటూ సమంత పొగిడింది. ఆమెతో కలసి విఘ్నేశ్ శివన్ మూవీ ‘కాతు వాకుల రెండు కాదల్’ చేస్తోంది సామ్. సినిమాలో నయనతో స్క్రీన్ షేర్ చేసుకుంటోన్న మిసెస్ అక్కినేని ఆమెని చూసి ఆహా అంటోంది. ఇక సమంత ఎమీ జాక్సన్ ను కూడా సూపర్ బ్యూటీఫుల్ అంటూ మెచ్చుకుంది. తెలుగులో సాయి పల్లవి, హిందీలో దీపికా పదుకొణే, ఆలియా భట్ పేర్లు తలుచుకుంది. వారంతా ఆమెని అందంతో, అభినయంతో ఇంప్రెస్ చేసేశారట.
ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోన్న ‘ద ఫ్యామిలీ ఉమన్’ సమంత అక్కినేని… ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అక్కడ ఎలా ఉంటుందో మన ‘జాను’ జర్నీ!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-