చిన్మయి కొత్త బిజినెస్… అద్భుతం అంటున్న సమంత

స్టార్ హీరోయిన్ సమంతకు ఇండస్ట్రీ నిండా సన్నిహితులే. ఆమెకు శిల్పారెడ్డి, చిన్మయి శ్రీపాద వంటి ఇండస్ట్రీకి చెందిన క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇటీవలే ఈ బ్యూటీ తమిళ నటీమణులు నయనతార, కళ్యాణి ప్రియదర్శన్, కీర్తి సురేష్ వంటి హీరోయిన్లతో సెల్ఫీలు దిగగా, శిల్పారెడ్డితో కలిసి ఆధ్యాతిక యాత్రను చేసింది. ఇక తాజాగా పాపులర్ సింగర్ చిన్మయితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఆమెపట్ల ప్రేమను వ్యక్త పరిచింది. అంతేకాదు చిన్మయి తాజాగా స్టార్ట్ చేసిన కొత్త బిజినెస్ అద్భుతం అంటూ ఇంస్టాలో రాసుకొచ్చింది.

Read also : పిరికిపంద చర్య… కేంద్రంపై కంగనా ఫైర్

తాజాగా చిన్మయితో సమంత కలిసి ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో “ప్రియమైన చిన్మయి మీ అభిరుచి నాకు తెలుసు. మీరు ప్రారంభించిన “డీప్ స్కిన్ డైలాగ్స్” ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది అనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. అభినందనలు పాపా. డీప్ స్కిన్ డైలాగ్స్ అనేది చెన్నైలో ఎఫ్డిఏ ఆమోదం పొందిన సరికొత్త మెడి స్పా. ఇందులో ప్రపంచ స్థాయి చర్మం, జుట్టు, శరీర చికిత్సలను పొందొచ్చు . నేను ఇందులో దక్షిణాసియాలోనే మొట్టమొదటి హాలీవుడ్ స్కల్ప్టింగ్ ట్రీట్‌మెంట్‌ను ప్రారంభించాను” అంటూ సమంత చిన్మయి కొత్త బిజినెస్ గురించి చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Related Articles

Latest Articles