దసరాకి సమంత కొత్త ప్రకటన!?

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ప్రతి రోజూ మీడియాలో నానుతూనే ఉంది. అయితే అక్టోబర్ 15 న దసరా సందర్భంగా ఆమె తన కొత్త ప్రాజెక్టుల గురించి ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల తెలుగులోనూ సమంత ఓ కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకుందనే వార్తలు వచ్చాయి. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ దర్శక ద్వయం రాజ్ డికె తో మరో సారి పని చేయబోతోందట.

ఈ వెబ్ సీరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రసారం అవుతుందట. ఇవి కాకుండా ఓ బాలీవుడ్ సినిమా కూడా ఓకె చేసినట్లు వినవస్తోంది. అయితే వీటన్నింటికి సంబంధించిన వివరాలను సమంత దసరా సందర్భంగా వెల్లడిస్తుందట. ఇదిలా ఉంటే తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన ‘శాకుంతలం’, తమిళంలో ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమాలు విడుదల కావలసి ఉంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే సమంత విడాకుల ఇష్యూ తర్వాత అంత యాక్టీవ్ గా ఉండటం లేదు. మరి దసరా నుంచైనా సమంత సామాజిక మాధ్యమంలో స్పీడ్ పెంచుతుందేమో చూడాలి.

-Advertisement-దసరాకి సమంత కొత్త ప్రకటన!?

Related Articles

Latest Articles