ఎవరి జీవితం పరిపూర్ణం కాదు… సామ్ @ డోర్ స్టెప్ మెంటల్ హెల్త్

కేరింగ్ వాలంటీర్ల ద్వారా 1997లో స్థాపించబడిన సంస్థ రోష్ని ట్రస్ట్ ఈరోజుతో 24 సంవత్సరాల మానసిక ఆరోగ్య సేవను పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహిమ దాట్ల, శిల్పా రెడ్డి సమక్షంలో సమంత హైదరాబాద్‌లో డోర్‌స్టెప్ మెంటల్ హెల్త్ సేవను ప్రారంభించింది. ఈ సందర్భంగా సామ్ తన జీవితంలో కష్టతరమైన రోజుల గురించి, అప్పట్లో ఈ థెరపీ తనకు ఎలా సహాయపడిందనే దాని గురించి ఓపెన్ అయ్యింది.

Read Also : ‘ఆర్య’ నుంచే ఈ స్టార్ హీరో బన్నీ ఫ్యాన్ అట !!

కార్యక్రమంలో పాల్గొని, సేవలను ప్రారంభించిన సమంతా రూత్ ప్రభు మాట్లాడుతూ రోష్ని సమాజానికి సేవ చేసే ఒక దయగల వేదిక అని, ఇక్కడ ప్రజలు కౌన్సెలింగ్, మానసిక వైద్యులతో ఉచిత సంప్రదింపుల తర్వాత మందులను తీసుకోవచ్చని చెప్పింది. “డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఒకరి సమస్యల గురించి మాట్లాడటం చాలా కష్టం. ఎవరి జీవితం పరిపూర్ణమైనది కాదు… ఇది నాకు బాగా తెలుసు. ఈ సంస్థ వల్ల ఇప్పుడు నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. అవసరమైన వారికి ఈ హెల్ప్ చేస్తున్న రోష్ని, దాట్లా ఫౌండేషన్ నుండి నేను ప్రేరణ పొందాను” అంటూ చెప్పుకొచ్చింది.

Read Also : ‘విక్రమ్ వేద’ అప్డేట్… హృతిక్ బర్త్ డే ట్రీట్ రెడీ

వివాహమైన 4 సంవత్సరాల తర్వాత నాగ చైతన్య నుండి సమంత విడిపోయినప్పటి నుండి సామ్ తన స్నేహితులు, పెంపుడు కుక్కలు, కుటుంబం, ప్రకృతి, వ్యాయామాల కోసం చాలా సమయాన్ని వెచ్చిస్తోంది. ఇక సామ్ ఇప్పుడు ‘యశోద’ అనే పాన్ ఇండియా సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంది.

Related Articles

Latest Articles