అఫీషియల్..’పుష్ప’ రాజ్ తో సమంత ఐటెంసాంగ్

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఇలాగే కొనసాగాలనిగీరి గీసుకొని ఎవరు కూర్చోవడం లేదు. పాత్ర మంచిదైతే.. పేరు తెచ్చేది అయితే.. వెనకాడకుండా చేసేస్తున్నారు. ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే వీరు మాత్రమే చేయాలి అని ఉండేది. కానీ, ఇప్పుడు అలా కాదు. స్టార్ హీరోయిన్స్ సైతం స్పెషల్ సాంగ్స్ కి హీరోలతో కాలు కదుపుతున్నారు. కాజల్, శృతి హాసన్, తమన్నా ఇలా వీరందరూ స్పెషల్ సాంగ్స్ లో కనువిందు చేసినవారే.

ఇక తాజాగా వీరి లిస్ట్ లో చేరిపోయింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఇప్పటివరకు సామ్ స్పెషల్ సాంగ్ లో మెరిసింది లేదు.. కానీ, తాజాగా ‘పుష్ప’ సినిమా కోసం అమ్మడు ఒక స్టెప్ ముందుకేసింది. ఎప్పటినుంచో అనుకున్నట్టుగానే పుష్ప రాజ్ తో సామ్ కాలు కదపనుంది. ఇక ఈ విషయాన్ని పుష్ప మేకర్స్ అధికారికంగా రివీల్ చేశారు. బన్నీ–సుకుమార్‌– డీఎస్‌పీ కాంబినేషన్‌ లో వస్తున్న ‘పుష్ప’ చిత్రంలో ప్రత్యేక గీతంలో నటించానికి సమంత అంగీకరించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ నెల చివర్లో ఈ సాంగ్ షూట్ ఉండనుంది. మరి సామ్, బన్నీతో కలిసి మాస్ స్టెప్పులతో ఇరగదీస్తుందేమో చూడాలి.

Related Articles

Latest Articles