పరువానికి మించిన బరువులు మోస్తున్న సామ్… వీడియో వైరల్

సౌత్ టాప్ బ్యూటీ సమంత ఇప్పుడు భారీ రేంజ్ లో సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమవుతోంది. స్టార్టింగ్ లోనే ‘ఊ అంటావా’ అంటూ ప్రేక్షకులను తన మత్తులో ముంచేసిన ఈ బేబీ ఇప్పుడు తన ఫిజిక్, ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ తో పాటు రెండు పాన్ ఇండియా సినిమాలు, రెండు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేతిలో ఉండడంతో వాటిపై పూర్తిగా దృష్టి సారించింది. ఈ మేరకు మెరుపు తీగలా మారి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడానికి జిమ్ లో తీవ్రంగా కష్టపడుతోంది ఈ అమ్మడు. తాజాగా ఆమె జిమ్ లో చేసిన హెవీ ఇంటెన్స్ వర్కౌట్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. “గో లో గో హోమ్… బ్యాక్ టు బేసిక్స్ @ జునైద్ షేక్ కరెక్టింగ్ మై ఫార్మ్” అంటూ ఈ వీడియోను షేర్ చేయగా, ఇప్పుడది వైరల్ అవుతోంది.

Read Also : ఆర్జీవీ మరో సంచలన ట్వీట్

కాగా సమంత ఇప్పుడు ‘యశోద’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. హరి శంకర్, హరీష్ నారాయణ్ దర్శకులుగా వ్యవహరిస్తున్న ఈ ద్విభాషా ప్రాజెక్ట్‌ని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరోవైపు నయనతారతో కలిసి సామ్ చేసిన విఘ్నేష్ శివన్ మూవీ ‘కాతు వాకుల రెండు కాదల్’ విడుదలకు సిద్ధమవుతోంది. రౌడీ పిక్చర్స్ మరియు సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

https://www.instagram.com/stories/samantharuthprabhuoffl/2746349819462588739/

Related Articles

Latest Articles