ఒక్క ట్వీట్ తో సమంత విడాకుల రూమర్స్ కి చెక్


సౌత్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. గ్లామర్ షో విషయంలోనూ ఏమాత్రం తగ్గటం లేదు. తనకు నచ్చిన పాత్రలు చేస్తూ చిత్రపరిశ్రమలో కొనసాగుతోంది. ఇటీవల వచ్చిన “ఫ్యామిలీ మ్యాన్-2″లో ఆమె చేసిన సన్నివేశాలు చూసి అంతా నోరెళ్లబెట్టారు. అయితే ఈ వెబ్ సిరీస్ తో ఆమెకు సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. సామ్ “శాకుంతలం” అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. భారీ చిత్రాల దర్శకుడు గగుణశేఖర్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం తమిళ సినిమా ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది.


ఇదిలా ఉంటే సామ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ఫోటోలు, వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతాయి. ఈ నేపథ్యంలో సామ్ తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి అక్కినేని అనే పేరు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో సామ్ కు, నాగ చైతన్యకు మధ్య విభేదాలు వచ్చాయని, ఆ మనస్పర్థల కారణంగా ఈ స్టార్ దంపతులు విడిపోబోతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ వార్తలపై సమంత కానీ, అక్కినేని కుటుంబం కానీ స్పందించలేదు. ఆదివారం నాగార్జున పుట్టినరోజు సందర్భంగా సామ్ చేసిన ట్వీట్ ఈ విడాకుల పుకార్లను పటాపంచలు చేసేసింది. ”మీ పట్ల నా గౌరవాన్ని వ్యక్తం చేయటానికి ఎలాంటి మాటలు సరిపోవు మామ” అంటూ సామ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ చూసిన అక్కినేని ఫ్యాన్స్ విడాకుల ప్రచారం పూర్తిగా పుకారేనని కొట్టిపారేస్తూ ఫుల్ ఖుషి అవుతున్నారు. సో మొత్తానికి సామ్ ఒకే ఒక్క ట్వీట్ తో డివోర్స్ రూమర్లకు చెక్ పెట్టిందన్నమాట. సమంతనా మజాకా..!

Read Also : “నో వర్డ్స్” మామ… నాగ్ కు సామ్ విషెస్

-Advertisement-ఒక్క ట్వీట్ తో సమంత విడాకుల రూమర్స్ కి చెక్

Related Articles

Latest Articles