ఆ రూమర్స్ కి చెక్ పెట్టిన సమంత.. దానికి నేను సిద్దమే అంటూ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొన్నిరోజులుగా పుకార్లు గుప్పుమన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే తాప్సి ప్రొడక్షన్ హౌస్ లో సామ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు కూడా పుకార్లు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ పుకార్లకు చెక్ పెట్టింది సామ్..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్.. బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ “ఎందుకు కాదు.. తప్పకుండ బాలీవుడ్ లో చేస్తాను… నాకు భాష ముఖ్యం కాదు.. సరైన కథ దొరికితే.. అది నా హృదయానికి తాకితే.. ఖచ్చితంగా చేస్తాను. స్క్రిప్ట్ మంచిగా ఉందా..? దానికి నేను సరిపోతానా..? నేను దానికి న్యాయం చేయగలనా? ఏ సినిమాకి సంతకం చేసినా ఇవే ప్రశ్నలు నాకు నేను వేసుకుంటాను” అని చెప్పుకొచ్చింది. ఇక బాలీవుడ్ ఎంట్రీ గురించి అమ్మడు ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చినట్లే అని అర్ధమవుతుంది. మరి సామ్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ఎవరితో ఉండబోతుందో చూడాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే..

Related Articles

Latest Articles