సమంతకు చుక్కలు చూపిస్తోందెవరు!?

సోమవారం పదకొండు గంటలు అయ్యిందో లేదో… స్టార్ హీరోయిన్ సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ ‘You know what this is 🖤’ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రేమ గురించి సమంత ఒక్క మాట మాట్లాడినా అలర్ట్ అయిపోతున్న ఆమె ఫ్యాన్స్ ఆ పోస్ట్ లోని ఫోటోలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా చూసుకుంటూ వెళ్ళాక… ఆ కామెంట్ వెనక తత్త్వం ఏమిటనేది చివరి వీడియోతో బోధపడింది.

ఇటీవల సమంత తన ఇంటికి ఓ కుక్కపిల్లను తెచ్చుకుంది. దానికి సాషా అనే పేరు పెట్టింది. కొత్తగా సమ్ము జీవితంలోకి ప్రవేశించిన సాషా ఆమెను క్షణం కూడా తీరికగా కూర్చోనివ్వడం లేదు, నిల్చోనివ్వడం లేదు. ఆ మధ్య ఒక రోజు తెగ ఇబ్బంది పెట్టేసిన సాషా ఇప్పుడు సమంత వేసుకున్న లాంగ్ డ్రస్ ను పట్టుకుని తెగ లాసేసింది. అయితే… ఇదంతా సాషా తన పట్ల చూపుతున్న ప్రేమే అంటోంది సమ్ము. సాషా చేస్తున్న చిలిపిపనులను వీడియోగా తీసి అందమైన కాప్షన్ లో పోస్ట్ చేసింది.

ఇదిలా ఉంటే… చిన్నప్పటి నుండీ వాల్డ్ డిస్నీ మూవీస్ ను ఇష్టపడుతూ పెరిగిన సమంతకు అందులోని బ్యూటిఫుల్ ప్రిన్సెస్ క్యారెక్టర్స్ చేయాలన్నది చిరకాల కోరికట. ప్రస్తుతం నటిస్తున్న ‘శాకుతలం’ కూడా అలాంటి పాత్రేనంటోంది సమంత. అంతేకాదు… ప్రకృతిని, పశుపక్షాదులను ఇష్టపడే సమంతకు శకుంతల లాంటి పాత్ర లభించడం సమంజసం కూడా!

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-