అతను నన్ను టార్చర్ చేశాడు- సమంత

పుష్ప.. పుష్ప.. పుష్ప.. ప్రస్తుతం ఎక్కడ విన్నా పుష్ప గురించే టాపిక్. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా రేపే ఓటిటీ లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబో ఎలా ఉంటుందో మరోసారి బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించిన సినిమా.. సమంత ఐటెంసాంగ్ చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా. ఒక హీరోయిన్ ఐటెం సాంగ్ చేయడానికి ఎంత కష్టపడిందో సామ్ తాజాగా తెలిపింది. పుష్ప సినిమాలోని ఊ అంటావా.. ఊఊ అంటావా పాటని చూసి ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ ఎంజాయ్ మెంట్ వెనుక సామ్ పడిన కష్టం అంతాఇంతా కాదు. ఆ స్టెప్స్ నేర్చుకోవటానికి సామ్ ఎంత కష్టపడిందో ఒక వీడియో ద్వారా ఆమె తెలిపింది.

ఊర మాస్ లిరిక్స్ కి సరిపడేలా డాన్స్ మాస్టర్ భాను అలాంటి స్టెప్స్ నేర్పించాడు. ఇక ఈ వీడియోలో సామ్ ఆ స్టెప్స్ నేర్చుకుంటూ కనిపించింది. డాన్స్ మాస్టర్ కఠినమైన స్టెప్స్ నేర్పించి టార్చర్ పెట్టాడని, నన్ను రిహార్సల్ తోనే చంపేశాడని చెప్పుకొచ్చింది. ఇక ఆ స్టెప్స్ కోసం సామ్ ఒళ్లు హూనం చేసుకొని మరి నేర్చుకుందని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సినిమా వాళ్ళు అంత డబ్బు ఎందుకు తీసుకుంటారు అని అనుకుంటాం కానీ వాళ్ళ కష్టం వాళ్ళు పడతారు అనడంలో తప్పు లేదని చెప్పుకొస్తున్నారు. బిహైండ్ ది సీన్స్ అంటూ సామ్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Latest Articles