నియంతలు, హంతకులు… సమంత క్రిప్టిక్ పోస్ట్ ఎవరి గురించి ?

నిన్న సమంత రూత్ ప్రభు మరియు నాగ చైతన్య విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘మా శ్రేయోభిలాషులందరికీ. చాలా చర్చలు, ఆలోచనల తరువాత చై, నేను మా స్వంత మార్గాలను అనుసరించడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ఒక దశాబ్దానికి పైగా స్నేహంగా కలిసి ఉండటం మా అదృష్టం, ఇది మా మధ్య ఒక ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంటుందని మా నమ్మకం. ఈ కష్ట సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా మాకు మద్దతివ్వాలని, మేము ముందుకు సాగడానికి అవసరమైన ప్రైవసీని ఇవ్వమని అభ్యర్థిస్తున్నాము” అంటూ సామ్ పోస్ట్ చేసింది. అటు నాగ చైతన్య సైతం ఇదే విషయాన్ని తెలియజేస్తూ పోస్ట్ చేశాడు.

Read Also : డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్ట్

అయితే ఈ పోస్ట్ కన్నా ముందు సామ్ ఒక క్రిప్టిక్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ‘మై మామ్ సెడ్’ అనే హ్యాష్ ట్యాగ్ తో “నేను నిరాశకు గురైనప్పుడు చరిత్రలో ఎప్పుడూ నిజం, ప్రేమ మాత్రమే గెలిచాయని గుర్తు తెచ్చుకుంటాను. నియంతలు, హంతకులు ఉన్నారు. అయితే వారు విజయం సాధించినప్పటికీ చివరికి ఓటమి పాలవుతారు” అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ క్రిప్టిక్ పోస్ట్ ఆమె ఎందుకు చేసింది ? ఎవరిని ఉద్దేశించి చేసింది ? అనే మాత్రం సామ్ అభిమానులకు అటు అక్కినేని అభిమానులకు అర్థం కాలేదు.

నియంతలు, హంతకులు… సమంత క్రిప్టిక్ పోస్ట్ ఎవరి గురించి ?
-Advertisement-నియంతలు, హంతకులు… సమంత క్రిప్టిక్ పోస్ట్ ఎవరి గురించి ?

Related Articles

Latest Articles