ఖతీజాగా రాబోతున్న సమంత

సమంత అతి త్వరలో ఖతీజాగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. విజయ్ సేతుపతి, నయనతారతో కలసి సమంత నటించిన కోలీవుడ్ మల్టీ స్టారర్ చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా నుంచి సమంత ఖతీజా లుక్ విడుదల అయింది. చిత్ర నిర్మాతలు ఈ చిత్రం నుండి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో విజయ్ రాంబోగా కనిపించనున్నాడు. రంజన్ కుడి అన్బరసు మురుగేశ భూపతి ఓహూందిరన్ పేరునే షార్ట్ కట్ లో రాంబోగా మార్చారు. రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సోషల్ మీడియా ద్వారా రాంబో పాత్రను పోషిస్తున్న విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇక ఖతీజా పాత్రలో సమంత చాలా అందంగా ఉంది. నయనతార ఫస్ట్ లుక్ కూడా విడుదల చేస్తామని అంటున్నారు దర్శకనిర్మాతలు. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను రౌడీ పిక్చర్స్ బ్యానర్‌తో కలిసి 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు వినిపిస్తోంది.

Related Articles

Latest Articles