‘మై మమ్మా సెడ్’… సామ్ మరో ఆసక్తికర పోస్ట్

నాగ చైతన్యతో నాలుగేళ్ల వివాహ బంధాన్ని విడాకుల ద్వారా తెంచుకున్న సమంత ఆ బాధ నుంచి కోలుకుని జీవితంలో ముందుకు సాగాలని ప్రయత్నిస్తోంది. అన్నీ మర్చిపోయి మళ్ళీ పనిలో పడడానికి ముందు సామ్ ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్లడం, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చూస్తూనే ఉన్నాము. అయితే విడాకులు తీసుకునే ముందు సమంత ‘మై మమ్మా సెడ్’ ఏ హ్యాష్ ట్యాగ్ తో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. మళ్ళీ చాలా రోజుల తరువాత సామ్ ‘మై మమ్మా సెడ్’ అనే హ్యాష్ ట్యాగ్ తో మరో ఆసక్తికర పోస్టును చేసింది.

Read Also : ఇకపై ఆ షో చేయనంటున్న ఎన్టీఆర్ ?

తాజాగా సామ్ “ఇప్పుడు మీరు ఇలా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి. రేపు మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని కోసం పోరాడుతూ ఉండండి” అంటూ ఇన్స్టా లో పోస్ట్ చేసింది. కాగా సమంత ఇటీవల తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పా రెడ్డితో కలిసి చార్ ధామ్ యాత్రకు వెళ్లి తిరిగి వచ్చింది. ఈ యాత్రలో ఆమె గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లను హెలికాప్టర్‌లో సందర్శించారు. ప్రస్తుతం సమంత రెండు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే షూటింగ్ లో పాల్గొననుంది. ప్రస్తుతం ఆమె నటించిన “శాకుంతలం” విడుదలకు సిద్ధమవుతోంది.

'మై మమ్మా సెడ్'… సామ్ మరో ఆసక్తికర పోస్ట్

Related Articles

Latest Articles