కౌన్సిలింగ్ స్టేజ్ లో సమంత, చై డైవోర్స్

సమంత, నాగచైతన్య వివాహబంధం తెగిపోయినట్లేనా!? ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేసిన వార్త సమంత డైవోర్స్. అయితే దీని గురించి అటు సమంత కానీ, ఇటు అక్కినేని ఫ్యామిలీగానీ ఎక్కడా స్పందించలేదు. సమంత మాత్రం మీమ్స్ తో మీడియాను ఎండగట్టే ప్రయత్నం చేసింది. తమిళంలో చేస్తున్న సినిమా తప్ప వేరే ఏ కొత్త సినిమా కమిట్ అవలేదు సమంత. అంతే కాదు వ్యక్తిగత సిబ్బందికి సెలవులు ఇచ్చి తను కూడా టూర్స్ వేస్తోంది.

కౌన్సిలింగ్ స్టేజ్ లో…
అసలు సమంత, చై విడాకుల వ్యవహారం ఎంత వరకూ వచ్చింది. నిజంగా విడాకులకు అప్లై చేశారా? అంటే… విశ్వసనీయ సమాచారం మేరకు నిజమే అని తెలుస్తోంది. విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారని… ప్రస్తుతం అది ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ స్టేజ్ లో ఉందని వినికిడి. దీని కోసమే టూర్ లో ఉన్న సమంత ఓ రోజు హైదరాబాద్ కి కూడా వచ్చి వెళ్ళిందట.

ఎక్కడ చెడింది…
మూడేళ్ళ పాటు అన్యోన్యంగా సాగిన నాగచైతన్య, సమంత జీవితనౌక ఎందుకు విడాకుల తుఫాన్ లో చిక్కుకుని అల్లాడుతోంది అంటే ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం ఫ్యామిలీ లైఫ్ కంటే ఇతర వ్యాపకాలకే సమంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని… అలా కాకుండా అమలగారిలా ఫ్యామిలీ లైఫ్ కి పరిమితం కావాలని అక్కినేని కుటుంబం ఆశిస్తోందట. అయితే సమంత అందుకు ససేమిరా అంటోందట. ఇక్కడే కుటుంబ బంధం బీటలు వారిందంటున్నారు. ఇరు కుటుంబాలు చేసిన హిత బోధ కూడా వర్కవుట్ కాలేదట. దాంతో విడాకులకు అప్లై చేయటం… అది కౌన్సిలింగ్ వరకూ వెళ్ళటం జరిగిందంటున్నారు. కౌన్సిలింగ్ లోనైనా పంతాలు వీడి ఒక్కటవుతారా! లేక విడాకులకే పట్టుబడతారా! అన్నది తేలాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Related Articles

Latest Articles

-Advertisement-