వాళ్లిద్దరూ అలంకరించుకుంటే… అభిమానుల ‘ఆహా’కారాలే!

సమంత, దీపికా… ఇప్పుడు ఈ ఇద్దరూ నార్త్ అండ్ సౌత్ ఇండియాని తమ ఫ్యాషన్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. అయితే, అందం, అభినయం, అలంకరణ విషయంలో సామ్ అండ్ డీపీకి తిరుగులేదు. వారిద్దరూ కాలు బయటపెడితే కెమెరా ఫ్లాష్ లతో మెరుపులు మెరవాల్సిందే! కుర్రాళ్ల గుండెల్లో ఉరుములు ఉరమాల్సిందే!

వాళ్లిద్దరూ అలంకరించుకుంటే… అభిమానుల ‘ఆహా’కారాలే!


సామ్ అండ్ దీపూ ఇద్దరి ఫ్యాషన్ స్టైల్స్ గమనిస్తే మనకు చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి! సమంత రియల్ సౌత్ ఇండియన్ బ్యూటీ విత్ ఏ ‘ఫ్యామిలీ ఉమన్’ ఇమేజ్! కానీ, టాల్ అండ్ టాలెంటెడ్ దీపికా పదుకొణే బ్రాండ్ బాలీవుడ్ లాంటిది! ఆమె లుక్స్ అటు హాలీవుడ్ రేంజ్ లోనూ ఉంటాయి…ఇటు దేసీ గాడెస్ లాగానూ మాయ చేస్తాయి. కాకపోతే, ఇప్పటికే చాలా సార్లు ఆన్ లైన్ ఫ్యాషన్ పోలీస్… సమంత అండ్ దీపికా మధ్య స్టైల్ సిమిలారిటీస్ వెదికిపట్టారు! ఇద్దరి ఫిజిక్స్, లుక్స్, కలర్ కాంప్లెక్షన్ అన్నీ వేరేనా… డ్రెస్సింగ్ అండ్ యాక్సెసరీస్ విషయంలో సేమ్ రూల్స్ ఫాలో అవుతుంటారు!

వాళ్లిద్దరూ అలంకరించుకుంటే… అభిమానుల ‘ఆహా’కారాలే!


సమంత, దీపికా వెస్ట్రన్ ఔట్ ఫిట్స్ వేసినప్పుడు స్ట్రైప్స్ ఉన్న సూట్స్ ప్రత్యేకంగా చూడవచ్చు! అలాగే, కొన్నిసార్లు ఈ ఇద్దరు బ్యూటీస్ రెడ్ కలర్ బ్లేజర్ సూట్ తోనూ రెడ్ రోజెస్ లా ఫ్యాషన్ మ్యాజిక్ చేసేశారు! అయితే, మిసెస్ చే అండ్ మిసెస్ రణవీర్… ఒకసారి వేసిన కలర్ మళ్లీ వేయకుండా అట్రాక్ట్ చేయటంలో… పర్ఫెక్ట్ లీ పర్ఫెక్ట్! వీళ్లిద్దరూ వేసిన వైట్ అండ్ వైట్ ఔట్ ఫిట్స్ చూస్తే ఆ సంగతి మనకు తెలుస్తుంది. తెల్లటి తెలుపులో తెల్లవారుఝాము తామరపువ్వుల్లా మనసులు దోచేస్తారు!

వాళ్లిద్దరూ అలంకరించుకుంటే… అభిమానుల ‘ఆహా’కారాలే!


రాణీ పద్మావతిగా కనిపించిన రాయల్ బ్యూటీ దీపిక! దుష్యంతుడి మనసు దోచిన శకుంతలగా కనిపించబోతోంది మన సమంత! రాజసం ఉట్టిపడేలా చీరకట్టుతో కనికట్టు చేయటంలో ఇద్దరూ ఇద్దరే! అయితే, సమంత, దీపికా వైట్ శారీ లుక్స్ ఇంటర్నెట్ లో ఎప్పుడూ చక్కర్లు కొడుతూ ఉంటాయి. స్లీవ్ లెస్ బ్లౌజెస్ తో వారిద్దరూ చేసిన మాయాజాలం అంతాఇంతా కాదు. మగ్గంపై వెండి వెన్నలనే చీరలుగా నేసి… కట్టుకోచ్చేశారేమో అనిపిస్తుంటుంది! ఇక చీరకట్టులో సామ్ అండ్ దీపిక మరో స్పెషల్ స్టైల్ స్టేట్మెంట్… ముత్యాలు! ఆణిముత్యాల్లాంటి ఈ అందగత్తెలు, యద పై ముత్యాల హారాలు వేసుకుని, అభిమానుల గుండెల్లోకి అలా బయలుదేరితే… ‘ఆహా’కారాలే!

వాళ్లిద్దరూ అలంకరించుకుంటే… అభిమానుల ‘ఆహా’కారాలే!
వాళ్లిద్దరూ అలంకరించుకుంటే… అభిమానుల ‘ఆహా’కారాలే!
-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-