అర్ధరాత్రి సమంత ఇంట్లో దొంగతనం.. స్టార్ హీరో అరెస్ట్

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది ఒక సామెత.. ఆ సామెతను తూచా తప్పకుండా పాటిస్తున్నారు కొంతమంది స్టార్లు. ఫేమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లను వెనకేసుకుంటున్నారు. ఒకపక్క సినిమాలు మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సినిమాలతో పాటు ఎన్నో బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కుర్ కురే చిప్స్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. దీనికి సంబందించిన యాడ్ ఇటీవలే రిలీజ్ అయ్యింది.

ఇక ఈ యాడ్ లో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉండడం విశేషం. ఈ యాడ్ లో అక్షయ్ కుమార్ అర్ధరాత్రి సమంత ఇంటికి దొంగతనానికి వస్తాడు. అక్కడ కుర్ కురే ప్యాకెట్ చూసి దాన్ని విప్పబోతాడు. ఆ సౌండ్ కి సమంత ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తుంది. అక్షయ్ చేతిలో ఉన్న కుర్ కురే ప్యాకెట్ ని లాక్కొని ఫ్యామిలీ అంతా తింటూ ఉంటారు. వారు తిందాం చూసి నోరురిపోతున్నట్లు, తనకి పెట్టమని అడగడంతో సామ్, అక్షయ్ కి ఆ ప్యాకెట్ ఇస్తుంది. అది ఖాళీ చేసి వెళ్తుండగా.. బండి వస్తుంది ఆగమని చెప్తోంది.. ఓ బండి కూడా ఇస్తారా అని అక్షయ్ ఆనందపడేలోపు పోలీస్ సైరెన్ మోగుతోంది. దీంతో అక్షయ్ పని అయిపోతోంది. ఇక ఈ యాడ్ ని సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ” సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన హీరో కుర్ కురే దొంగగా మారిపోయాడు. అక్షయ్ కుమార్ ఏంటి ఈ ప్రవర్తన” అంటూ చెప్పుకొచ్చిందిప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Latest Articles