రాజీ ప్రిపరేషన్ మామూలుగా లేదుగా!

‘ది ఫ్యామిలీ మ్యాన్’ -2 వెబ్ సీరిస్ జనం ముందుకు వచ్చి చాలా రోజులే అయింది. అందులోని నటీనటులు మాత్రం ఆ హ్యాంగోవర్ నుండి బయటకు రాలేకపోతున్నారు. ఇప్పటికీ మనోజ్ బాజ్ పాయ్ ఆ వెబ్ సీరిస్ వర్కింగ్ స్టిల్స్ ట్వీట్ చేస్తూనే ఉన్నాడు. బుధవారం కూడా ఈ వెబ్ సీరిస్ చివరిలో ప్రధానమంత్రితో తివారి టీమ్ సత్కారం సందర్భంగా దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ, ప్రస్తుతం హాలీడేస్ లో ఉన్నామని, త్వరలో మళ్ళీ జనం ముందుకు వస్తామని తెలిపాడు.

ఇక ప్రముఖ నటి సమంత అయితే తొలిసారి హిందీ ఎంటర్ టైన్ మెంట్ రంగంలోకి ‘ది ఫ్యామిలీ మ్యాన్- 2’ తోనే అడుగుపెట్టింది. ఇందులో ఆమె పోషించిన లేడీ టెర్రరిస్ట్ రాజీ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఈ వెబ్ సీరిస్ అంతా సమంత చాలా సీరియస్ గా కనిపిస్తుంది. ప్రారంభంలో అండర్ గ్రౌండ్ లో ఉండే మిలిటెంట్ గా, ఓ కింది తరగతి ఉద్యోగినిగా కనిపించే సమంత నిజానికి తీవ్రవాద సంస్థ కు చెందిన పైలెట్ అని తర్వాత తెలుస్తుంది. విశేషం ఏమంటే… రాజీ పెదాలపై ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా నవ్వు అనేది కనిపించదు. అంత గాఢత ఉన్న పాత్రను సమంత పోషించింది. కానీ దానికి పూర్తి భిన్నంగా ఆమె సెట్ లో షూటింగ్ గ్యాప్ లో ప్రవర్తించింది. దానికి సంబంధించిన ఓ వీడియోను సమంతనే ఇన్ స్టాగ్రామ్ లో బుధవారం పోస్ట్ చేసింది. పిచ్చిపిచ్చిగా స్టెప్పులేస్తూ, నోటికి వచ్చిన పాట పాడుతూ, షాట్ గ్యాప్ ను సమంత బాగా ఎంజాయ్ చేసినట్టు దీనిని చూస్తే తెలుస్తోంది. ‘రాజీ పాత్ర పోషణకు నేను ఎలా ప్రిపేర్ అయ్యాను?’ అని అడిగేవారికి ఇదే సమాధానం అంటూ ఓ చిన్న వీడియోను సమంత పోస్ట్ చేసింది. తాము బ్యాడ్ సింగర్స్ అని తెలిసినా… పాడకుండా ఉండటం తమ వల్ల కాదని చెబుతోంది సమంత!!

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-