సమంత ఇన్ స్టా దందా!?

ప్రస్తుతం తారలు తమ సోషల్ మీడియాల్లో ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఉన్నారు. ఎంత మంది ఎక్కువ ఫాలోయర్స్ ఉంటే అంత ఆదాయం మరి. అందుకే తమ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అందించటంతో పాటు ఫోటోషూట్స్ పేరుతో రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ఇక హీరోయిన్స్ సంగతి చెప్పనక్కరలేదు. అందాల ఆరబోతతో ఫాస్ట్ గా ఫాలోయర్స్ ని పెంచుకుంటున్నారు. అక్కినేని కోడలు సమంతకు ఇన్ స్టా సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా అసాధారణ ఫాలోయింగ్ ఉంది. పెళ్ళైనా కూడా ఆందాల ప్రదర్శనలో ఏమాత్రం వెనకడుగు వేయటం లేదు సమంత. అమ్మడికి ఇన్ స్టాలో 18మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇలా దాదాపు 2కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్న సమంతను వెతుక్కుంటూ బ్రాండ్ ప్రమోటర్స్ వస్తున్నారు. దీంతో ప్రచారం కోసం డిమాండ్ కి తగ్గట్లే వసూలు చేస్తోంది సమంత.

Read Also: కెజియఫ్ 2కి 255 కోట్ల భారీ డీల్

అలా ఇన్ స్టాలో బ్రాండ్స్ ప్రమోషన్ కోసం సమంత ఒక్కొ బ్రాండ్ కి 25లక్షల నుంచి 30లక్షల వరకూ వసూలు చేస్తోందట. ఒక్కో పోస్టింగ్ కి సమంత అందుకుంటున్న మొత్తం అది. ఈ లెక్కన నెలవారి ఆదాయం సినిమాల ఆదాయానికి మించి ఉంటుందని వేరే చెప్పాలా! ఇప్పటి వరకూ మన తారలు సినిమాల పారితోషికాలు, వాణిజ్య ప్రకటనల్లో నటించటం వలననే ఆదాయం పొందేవారు. షాప్ ఓపెనింగ్స్, టీవీ షోస్ వంటివి సరేసరి. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వాటన్నింటినీ డామినేట్ చేస్తుందనే చెప్పాలి. ఇక దీనికి తోడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఎలాగూ ఉండనే ఉన్నాయి. అందుకు ఉదాహరణ అమెజాన్ ప్రైమ్ వారి ‘ఫ్యామిలీ మ్యాన్ 2’. ఇందులో నటించినందుకు సమంత భారీమొత్తాన్ని అందుకుంది. మరి ఎంత కాలం సమంత ఈ సోషల్ మీడియా దందా సాగిస్తుందో చూద్దాం.

-Advertisement-సమంత ఇన్ స్టా దందా!?

Related Articles

Latest Articles