బాలీవుడ్ కనెక్షన్స్ కోసం సామ్ ప్రయత్నాలు ?

సమంత బాలీవుడ్‌ పరిచయాలు పెంచుకునే ప్రయత్నాల్లో పడినట్టు కన్పిస్తోంది. విడాకుల తరువాత కెరీర్ పై ఫోకస్ పెట్టిన సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ బ్యూటీ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులలో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సమంత త్వరలో బాలీవుడ్‌ లోకి అడుగు పెట్టనుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆమె బాలీవుడ్ మూవీపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తన బాలీవుడ్ డ్రీమ్ డెబ్యూకి ముందు సమంతా బాలీవుడ్‌లో కనెక్షన్‌లను ఏర్పరచుకునే ప్రయత్నంలో పడింది.

Read Also : ‘అన్‌స్టాపబుల్’ రేర్ ఫీట్… ఆహా అన్పిస్తున్న బాలయ్య షో

తాజాగా బాలీవుడ్ స్టార్ దివా దీపికా పదుకొణె తన పుట్టినరోజును జరుపుకుంది. ఈ పొడుగు కాళ్ల సుందరికి శుభాకాంక్షలు తెలుపుతూ సమంత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. “లోపల, వెలుపల అత్యంత అందమైన దీపికా పదుకొనెకి పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ సామ్ ట్వీట్ చేసింది. గత కొన్ని రోజుల నుంచి ప్రియాంక చోప్రా పోస్టులపై కూడా స్పందిస్తోంది సామ్. తాజాగా కూడా ప్రియాంక చోప్రా పిక్ పోస్ట్ చేసి వెరీ యంగ్ అంటూ రాసుకొచ్చింది.

ఇక రాజ్ అండ్ డికె దర్శకత్వం వహించిన భారతీయ స్పిన్ ఆఫ్ “సిటాడెల్” అనే మరో వెబ్ సిరీస్‌లో సమంత నటించనుంది. ఆమె ఇందులో గూఢచారి పాత్రలో యాక్షన్ అవతార్‌లో కనిపిస్తుంది. వరుణ్ ధావన్‌ ఆమెతో కలిసి కనిపించనున్నాడు. ఇవి మాత్రమే కాకుండా ఆమె కిట్టీలో ఇతర ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి. ఆమె తదుపరి రెండు చిత్రాలు’శాకుంతలం’, ‘యశోద’ పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్నాయి.

Related Articles

Latest Articles