2005లో ‘జస్ట్ మిస్’… అతనే ఇప్పుడు ‘జేమ్స్ బాండ్’ అవుతాడా?

జేమ్స్ బాండ్ ఓ కల్పిత పాత్ర అయినా మూవీ లవ్వర్స్ కి అతనో రియల్ హీరో! అందుకే, హాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ కూడా బాండ్ గా కనిపించాలని ఆరాటపడుతుంటారు. కానీ, అది అందరికీ దక్కే అవకాశం కాదు. ఇప్పుడు కూడా మరోసారి 007 రేస్ మొదలైంది! ‘నో టైం టూ డై’ సినిమాతో 25 చిత్రాల మైలురాయిని దాటుతోన్న జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజ్ కొత్త యాక్షన్ హీరో అన్వేషణలోనూ ఉంది. ప్రస్తుతం బాండ్ గా కొనసాగుతోన్న డేనియల్ క్రెయిగ్ ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించేశాడు. నెక్ట్స్ బాండ్ మూవీలో కొత్త ముఖం కనిపించాల్సి ఉంది…

‘నో టైం టూ డై’ సినిమా విడుదల తరవాత తమ వరల్డ్ ఫేమస్ స్పై మూవీ ఫ్రాంఛైజ్ కోసం ఫిల్మ్ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. డేనియల్ క్రెయిగ్ వారసుడ్ని ప్రకటించబోతున్నారు. అయితే, నెక్ట్స్ సీక్రెట్ ఏజెంట్ 007 అయ్యేందుకు చాలా పెద్ద క్యూనే ఉంది. టామ్ హార్డి, జీన్ పేజ్ లాంటి యంగ్ హాలీవుడ్ సూపర్ స్టార్స్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. అయితే, ఆల్రెడీ 41 ఏళ్లున్న సీనియర్ టాలెంటెడ్ యాక్టర్ స్యామ్ హ్యూగన్ కూడా కర్ఛీప్ విసిరే పనిలో ఉన్నాడు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు చెప్పాడు…

2005లో అప్పటి బాండ్ మూవీ ‘క్యాసినో రొయాల్’ కోసం క్యాస్టింగ్ జరుగుతోండగా స్యామ్ హ్యూగన్ ఆడిషన్స్ కి అటెండ్ అయ్యాడట. జేమ్స్ బాండ్ పాత్ర కోసం ఎంతో పోటీ పడ్డప్పటికీ డేనియల్ క్రెయిగ్ ఛాన్స్ కొట్టేశాడు. దాంతో ఇతర సినిమాలు చేస్తూ ఇంత కాలం హాలీవుడ్ లో కొనసాగిన హ్యూగన్… ‘అవుట్ ల్యాండర్’ మూవీస్ తో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు! 2005తో పోలిస్తే ఇప్పుడు ఆయన బిగ్ స్టార్. కాబట్టి తనకు బాండ్ అయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయంటున్నాడు! కానీ, స్యామ్ హ్యూగన్ ఏజెంట్ 007 అయినా కూడా వయస్సు సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆయన ఇప్పటికే 40 దాటేశాడు. ఎక్కువ కాలం జేమ్స్ బాండ్ కొనసాగలేడు. ఆ కారణం చేత ఫిల్మ్ మేకర్స్ పక్కన పెడతారని క్రిటిక్స్ అంటున్నారు. అయినా కూడా ‘క్యాసినో రొయాల్’ సమయంలో తీరని తన జేమ్స్ బాండ్ కల ఇప్పుడు తీరుతుందని గట్టిగా నమ్ముతున్నాడు హ్యూగన్! చూడాలి మరి, రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-