గర్ల్ ఫ్రెండ్ తో సల్మాన్ టర్కీ ట్రిప్ ?

సల్మాన్ ఖాన్ ఇప్పుడు టర్కీలో తన గర్ల్ ఫ్రెండ్ తో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడా ? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమాతో బాలీవుడ్‌లో సింగర్ మారిన ఇయులియా వంతూర్ తాజాగా షేర్ చేసిన వీడియో ఈ రూమర్లకు కారణమైంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో టర్కిష్ హోటల్ లో ఉన్నట్లు తెలుపుతూ వీడియోను పంచుకుంది.

Read Also : దీన్ని ఎవడు చేసుకుంటాడో గానీ… ఎడారిలో ఐస్ తయారు చేసినట్టే !

ప్రస్తుతం సల్మాన్ కూడా తన కొత్త సినిమా షూటింగ్ లో భాగంగా అక్కడే ఉన్నాడు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ‘టైగర్ 3’కి సంబంధించి 5 రోజుల షెడ్యూల్ పూర్తి చేసిన సల్మాన్ ఖాన్ ఏ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం బృందంతో కలిసి టర్కీ చేరుకున్నాడు. ఇస్తాంబుల్‌లో ఈ షూటింగ్ జరగనుంది. సోషల్ మీడియాలో తాజాగా ఇయులియా పోస్ట్‌లను చూస్తే ఆమె కూడా సల్మాన్ తో ఉందా ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి ఇద్దరూ ఒకే చోట ఉండడం యాదృచ్చికంగా జరిగిందా ? లేక ఇద్దరూ కలిసే ఈ ట్రిప్ ప్లాన్ చేశారా ? అని ఆలోచనలో పడ్డారు.

టర్కీలోని నాలుగు ప్రదేశాలలో ఈ సినిమా ను చిత్రీకరించారు. హీరో ఎంట్రీ సన్నివేశాన్ని ఇస్తాంబుల్‌లోని మైడెన్ టవర్, యూరప్‌లోని అత్యంత ఖరీదైన లగ్జరీ హోటల్ అంటాల్యలోని మార్దన్ ప్యాలెస్‌లో చిత్రీకరించారు. ‘టైగర్ 3’ మూవీ సెట్స్ నుంచి సల్మాన్ లుక్, సినిమాలోని కొన్ని షాట్లు లీక్ అయ్యాయి. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో చాలా మంది అభిమానులు అక్కడికి రావడంతో ఆ లీక్స్ జరిగాయి.

View this post on Instagram

A post shared by Iulia Vantur (@vanturiulia)

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-