‘అంతిమ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరించిన సల్లూభాయ్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అంతిమ్ : ది ఫైనల్ ట్రూత్’. ఓ పోలీస్ అధికారికి, గ్యాంగ్ స్టర్ కు మధ్య జరిగే క్లాష్ ఆధారంగా ఈ సినిమాను మహేశ్ మంజ్రేకర్ తెరకెక్కించబోతున్నారు. మంగళవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు. ‘చెడును అంతం చేసే శుభారంభం. గణపతి బప్పా మోరియా’ అంటూ సల్మాన్ ఖాన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఆయుష్ శర్మ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ అత్యధిక భాగం పూణేలో జరుగబోతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల సందర్భంగా ఆయుశ్ తన హర్షాన్ని వ్యక్తం చేశాడు. ఇది అందరికీ నచ్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, సల్మాన్ తో కలిసి ఈ మూవీలో నటించడమనేది కల నిజమైనట్టుగా ఉందని చెప్పాడు. జీ 5 మరాఠీలో ప్రసారమైన క్రైమ్ డ్రామా ముల్షీ పేట్రన్ స్ఫూర్తితో ‘అంతిమ్’ మూవీ తెరకెక్కబోతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-