సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్న సల్మాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఆయన టీకా సెంటర్ కు వెళ్లిన పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మే 14 శుక్రవారం ముంబైలోని ఒక టీకా కేంద్రంలో సల్మాన్ ఖాన్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. అంతకుముందు సల్మాన్ ఖాన్ మార్చి 24న ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. భారతదేశంలో ప్రస్తుతం కోవిడ్ -19 కేసుల సంఖ్యా భారీగా పెరిగిపోతోంది. ఇక సెలబ్రిటీలు కూడా సురక్షితంగా ఉండటం, టీకాలు వేయించుకోవడం గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ ఈద్ కానుకగా మే 13న విడుదలైంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ దక్షిణ కొరియా యాక్షన్ చిత్రం ‘ది అవుట్‌లాస్’కు హిందీ రీమేక్. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, దిషా పటానితో పాటు జాకీ ష్రాఫ్, రణదీప్ హుడా నటించారు. ఈ చిత్రం జీ5లో పే పర్ వ్యూ వ్యూ బేస్ తో పాటు అన్ని డిటిహెచ్ ఆపరేటర్ల దగ్గర లభిస్తుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-