యూరోప్ లో ‘టైగర్’ వేట… విదేశాల్లోనే 50 రోజుల పాటూ సల్మాన్, కత్రీనా!

‘టైగర్’ యూరోప్ కి బయలుదేరబోతున్నాడు! ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాల తరువాత సీక్వెల్ గా వస్తోన్న చిత్రం ‘టైగర్ 3’. కత్రీనాతో ముచ్చటగా మూడోసారి రొమాన్స్ చేయనున్న టైగర్ ఇమ్రాన్ హష్మీని విలన్ గా ఎదుర్కోబోతున్నాడు. ఇండియాలో ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన యశ్ రాజ్ ఫిల్మ్స్ టీమ్ ఆగస్ట్ లో యూరోప్ కి వెళ్లనుంది. సల్మాన్ వచ్చే నెల 12న ఫ్లైట్ ఎక్కుతాడని టాక్…

సల్మాన్ బయలుదేరాక కొద్ది రోజుల్లోనే కత్రీనా కూడా విదేశాలకు వెళ్లనుంది. ఆస్ట్రియా, మొరాకో టర్కీ, రష్యాల్లో సల్లూ అండ్ క్యాట్ తమ సీక్రెట్ మిషన్ పూర్తి చేయనున్నారు. ఇమ్రాన్ హష్మీ కూడా లెటెస్ట్ 50 డే ఫారిన్ షెడ్యూల్ లో పాల్గొంటాడు. కరోనా కారణంగా చాలా తర్జనభర్జనల తరువాత యూరోపియన్ లోకేషన్స్ కు వెళ్లాల్సిందేనని నిర్మాత ఆదిత్య చోప్రా నిర్ణయించాడని సమాచారం. 300 కోట్ల భారీ బడ్జెట్ తో ‘టైగర్’ మూవీ రూపొందుతోంది. యాక్షన్ థ్రిల్లర్ కావటంతో అనేక మంది స్టంట్ కొరియోగ్రఫర్స్ టాలెంట్ ని ఏక కాలంలో సినిమా కోసం ఉపయోగిస్తున్నారు! ‘టైగర్’ సాహసాలు పెద్ద తెరపై కళ్లు చెదిరిపోయేలా ఉండబోతున్నాయని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-