“సలార్” విలన్ కోసం స్పెషల్ సెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “కెజిఎఫ్ ఫేమ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న అండర్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్‌”తో రాబోతున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం 2022 ఏప్రిల్ 14న థియేట్రికల్‌గా విడుదల అవుతుందని “సలార్” మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం “సలార్” బృందం ప్రధాన విలన్ ఇంటిని అంటే భారీ సెట్‌ను నిర్మిస్తోంది. ఈ సెట్‌లో ప్రభాస్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వారు సెట్స్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న “సలార్” హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Read Also : ‘గని’ రిలీజ్ డేట్… ఇంకా సస్పెన్స్ ఏంటి వరుణ్ ?

“సలార్” ఫస్ట్ లుక్ పోస్టర్ గత సంవత్సరం డిసెంబర్‌లో విడుదలైంది. దీనికి సినీ ప్రేమికుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆయన తండ్రి, కొడుకుగా కనిపించనున్నారు. ఇది మాఫియా ప్రపంచంలో ప్రతీకారం తీర్చుకునే కథ. “బాహుబలి” స్టార్ “సలార్‌”తో పాటు నాగ్ అశ్విన్ బహుభాషా సైన్స్ ఫిక్షన్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. తాత్కాలికంగా ఈ చిత్రాన్ని “ప్రాజెక్ట్ కే” పేరుతో పిలుస్తున్నారు. దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్”తో, రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా “రాధే శ్యామ్”లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది.

-Advertisement-"సలార్" విలన్ కోసం స్పెషల్ సెట్

Related Articles

Latest Articles