‘సలార్’ ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ కు సర్వం సిద్ధం!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ షూటింగ్ ను పూర్తి చేసి, ఇప్పుడు ‘ఆదిపురుష్, సలార్’ చిత్రాల చిత్రీకరణపై దృష్టి పెట్టాడు. ‘రాధేశ్యామ్’ను తెలుగు యువకుడు ‘జిల్’ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుంటే, ‘ఆదిపురుష్’ను హిందీ దర్శకుడు ఓంరౌత్, ‘సలార్’ను కన్నడిగ అయిన ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. సో… ఈ మూడు పాన్ ఇండియా మూవీస్ ను మూడు భాషలకు చెందిన దర్శకులు హ్యాండిల్ చేస్తున్నారు.

Read Also : ఈ మలయాళ హీరోకు “రంగస్థలం” నచ్చేసిందట !

విశేషం ఏమంటే… ‘సలార్’ షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా కొంతకాలం షూటింగ్ ను ఆపేసిన ప్రశాంత్ నీల్… ఇప్పుడు తాజా షెడ్యూల్ కు సర్వం సిద్ధం చేశాడని తెలుస్తోంది. ఈ నయా షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. రెండు వారాలకు పైబడి భారీ స్థాయిలో ఈ ఇంటర్వెల్ బ్లాక్ ను షూట్ చేయబోతున్నారట. ఇందుకోసం ఇప్పటికే రెండు స్పెషల్ సెట్లను ఆర్.ఎఫ్.సి.లో వేశారు. అంతేకాదు… దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ నూ పూర్తి చేశారు. సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే ఈ యాక్షన్ ఎపిసోడ్ లో అనేకమంది జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొనబోతున్నారట. మూవీ టీమ్ చెబుతున్న దాని ప్రకారం ఈ షెడ్యూల్ లో హీరోయిన్ శ్రుతీహాసన్ పాల్గొనదని తెలుస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-