ఓటీటీలోనే ‘శాకిని డాకిని’!

‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండో సినిమా ‘శాకిని డాకిని’. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్‌ టైటిల్ రోల్స్ పోషిస్తున్నారు. టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘శాకిని – డాకిని’ సినిమాను ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లలో కాకుండా ఓటీటీలోనే విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాతల్లో ఒకరైన సురేశ్ బాబు తెలిపారు. అలానే శ్రీసింహ హీరోగా తాము నిర్మిస్తున్న ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమా కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ఆయన చెప్పారు.

Related Articles

Latest Articles