ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వీపీ సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌ లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్‌ లో శుక్రవారం సజ్జనార్‌ ఎండీ గా బాధ్యతలు చేపట్టారు. సజ్జనార్‌ అంతకు ముందుకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ గా పని చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల పాటు సైబరాబాద్‌ సీపీగా పని చేసి.. నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు. 2009 లో దేశం లోనే సంచలనం సృష్టించిన దిశ కేసులో సజ్జనార్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సజ్జనార్‌ గతం లో సీఐడీ, ఇంటిలిజెన్స్‌ విభాగాలలో పనిచేశారు.

Related Articles

Latest Articles

-Advertisement-