పీఆర్సీపై సీఎం సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నాం : సజ్జల

ఏపీలో పీఆర్సీపీ ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు ప్రభుత్వం పీఆర్సీపై చర్చలు జరిగిపింది. ఇప్పటికే అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికలో ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన అంశాలు లేవని ఉద్యోగ సంఘాలు గళమెత్తాయి. అయితే నిన్న కూడా సీఎం జగన్‌ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. అయితే నేడు సీఎం జగన్‌ మరోసారి ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీపై సీఎం సానుకూల ప్రకటన చేస్తారని భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు నిన్న ఉద్యోగ సంఘాలకు సీఎం వివరించారని, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన వస్తుందని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని పోయేలా నిర్ణయం ఉంటుందని, పీఆర్సీపై కాసేపట్లో సీఎం జగన్‌ ప్రకటన చేస్తారని ఆయన వెల్లడించారు.

Related Articles

Latest Articles