ఉద్యోగులు మన టీమ్‌లో భాగం అనేది సీఎం జగన్ భావన : సజ్జల

ఎన్ని రోజుల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పీఆర్పీ ప్రకటనపై తెరపడింది. ఈ రోజుల సీఎం జగన్‌ పీఆర్సీపీపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీ విషయానికి క్లారిటీ ఇచ్చామని, ఎన్నికల్లో చెప్పినట్టుగానే 27 శాతం ఐఆర్ ఇవ్వడం చరిత్ర అని ఆయన అన్నారు. శతాబ్దంలోనే జరగని పరిణామాలు, నష్టాలు కోవిడ్ వల్ల వచ్చాయని ఆయన అన్నారు.

2020 నుంచి 2022 వరకు కోవిడ్ ప్రభావం ఉంది.. ఈ ఏడాది కూడా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. ఏదైనా పారదర్శకంగా.. నిజాయితీగా చేయడం సీఎం జగన్ వైఖరి అని ఆయన పేర్కొన్నారు. అందుకే 2014 ఎన్నికల్లో రుణమాఫీ లాంటి అబద్దపు హామీలు ఇవ్వలేదని, రుణమాఫీని చంద్రబాబు సరిగా అమలు చేయలేదని, చెప్పిన దానికంటే ఎక్కువ చేయాలని ఉన్నా.. పరిస్థితులు అనూకులించకపోవడమే కాకుండా పూర్తి ప్రతికూలంగా ఉన్నాయన్నారు. ఉద్యోగులు మన టీమ్‌లో భాగం అనేది సీఎం జగన్ భావన అని ఆయన తెలిపారు.

ఉద్యోగుల కుటుంబాలు.. సంక్షేమం కూడా చూసుకున్నామని, అన్నింటినీ బేరీజు వేసుకునే క్రమంలోనే కొంత జాప్యమైందన్నారు. రిటైర్మెంట్ వయస్సు రెండేళ్లు పెంచడమనేది కేవలం మనస్సున్న వాళ్లే చేయగలిగే పనులు అని, యువతకు కొత్త ఉద్యోగాలిచ్చాం.. ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు పెంచాం. జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

Related Articles

Latest Articles