దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు : సజ్జల

కుప్పం మొత్తం ఓటర్లు సుమారుగా 37 వేలు. మొదటి సారి మున్సిపాలిటీ అయిన కుప్పం ఎన్నికల గురించి చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే బాధేసింది అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇటువంటి వ్యక్తిని రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఎలా భరించింది అనిపించింది. జనసేన, టీడీపీ, బీజేపీ ఒకే తాను ముక్కలు. ఈ మూడు పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకుని వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు కుప్పాన్ని చెరబట్టారు. ఆయన చెరలో కుప్పం దశాబ్దాలుగా నలిగిపోయింది. ఇన్నాళ్లు మకుటం లేని మహారాజులా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు వెలిగారు. ఇప్పుడు ఆ కోట బద్దలయ్యింది. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం ప్రభావాన్ని కుప్పం ప్రజలు చూస్తున్నారు. దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు అని సజ్జల అన్నారు.

అందుకే ఎంతో ధైర్యంతో ముఖ్యమంత్రి ప్రత్యేక చట్టమే తీసుకుని వచ్చారు. చంద్రబాబుకు సందర్భంతో సంబంధం లేదు. ఒక మున్సిపాలిటీ ఎన్నికల గురించి చెబుతూ ప్రజాస్వామ్య విలువలు వంటి భారీ మాటలు మాట్లాడుతున్నాడు. మధ్యాహ్నం ఒంటి గంటకే 60 శాతం పోలింగ్ నమోదయ్యింది. ప్రజలు స్వచ్ఛందంగా వస్తేనే ఈ స్థాయిలో పోలింగ్ నమోదవుతుంది. దొంగ ఓట్లకు అవకాశం ఎక్కడ ఉంటుంది అని ప్రశ్నించారు. అక్కడ మీ ఏజెంట్లే ఉంటారుగా.. అసలు టీడీపీ కార్యకర్తలు అంత మంది ఎందుకు గుమిగూడారు… టీడీపీ నేతలు డబ్బులు పంచి ఎవరి పై మాట్లాడుతున్నారు అని అడిగారు.

Related Articles

Latest Articles