చంద్రబాబు పాలనలో ఎందుకు ప్రశ్నించలేదు ? : పవన్ కు సజ్జల చురకలు

పవన్ కళ్యాణ్ కు కౌంటర్‌ ఇచ్చారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. చంద్రబాబు 5 ఏళ్ల హయాంలో రోడ్ల రిపేర్లకు వెయ్యి కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని… అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు.. రోడ్లు ఎందుకు పూడ్చలేదని నిలదీశారు. ఇవాళ వచ్చి రెండు తట్టల మట్టి వేస్తే అయి పోతుందా ? అని ప్రశ్నించారు సజ్జల. కొండ ఎవరో ఎత్తు తుంటే చివరలో వేలు పెట్టి నేనే ఎత్తుతున్నాను అన్నట్లు ఉందని పవన్‌ కళ్యాణ్‌ కు చురలక అంటించారు. పవన్ కళ్యాణ్ ఏం నిరూపించాలనుకుంటున్నారో అర్ధం కావటం లేదని… కేవలం రిపేర్ల కోసం రెండు వేల రెండు వందల కోట్ల టెండర్లు పూర్తయ్యాయని వివరించారు. వర్షాల్లో రోడ్లు బాగు చేసే పనులు చేపడితే మెంటల్ కేస్ అంటారని… నవంబర్ నుంచి పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు.

-Advertisement-చంద్రబాబు పాలనలో ఎందుకు ప్రశ్నించలేదు ? : పవన్ కు సజ్జల చురకలు

Related Articles

Latest Articles