ఓటిఎస్ పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు : సజ్జల

ఒన్ టైం సెటిల్మెంట్ పథకం పై ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో అవగాహన కార్యక్రమాల పై ఫోకస్ చేసింది వైసీపీ. ఒన్ టైం సెటిల్మెంట్ పథకం పై పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. దీనికి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాధరాజు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సజ్జల మాట్లాడుతూ… పేదలకు లబ్ది జరక్కుండా అపోహలు కల్గించి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు పచ్చమీడియా, టీడీపీ. ఓటిఎస్ పథకంపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు అని తెలిపారు.

Read Also : ఇండియాపై ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా అజాజ్ పటేల్…

ఈ పథకం ద్వారా గృహాల లబ్దిదారులకు పదివేల కోట్ల రూపాయల మేలు జరుగుతుంది. అలాగే రిజిస్ర్టేషన్ ఛార్జీల మినహాయింపు దొరుకుతుంది. పేదవారికి మేలు చేకూర్చేందుకే జగనన్న సంపూర్ణ గృహహక్కు అని అన్నారు. సొంతంగా రిజిస్ర్టేషన్ చేయించుకోవాలంటే ప్రాంతాన్ని బట్టి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పథకం పట్ల ప్రజలలో అపోహలు తొలగించాలి. ప్రతి ఇంటిని సందర్శించి వారికి కలిగే ప్రయోజనాన్ని వివరించాలి అని పేర్కొన్నారు సజ్జల.

Related Articles

Latest Articles