కసరత్తుతోనే ఆలస్యం.. రేపు నామినేటెడ్‌ పోస్టుల ప్రకటన..

నామినేటెడ్‌ పోస్టులు ఇవాళ ప్రకటించాల్సి ఉన్నా… రేపటికి వాయిదా పడింది… అయితే, కసరత్తు పూర్తి కాకపోవడంతో.. పోస్టుల ప్రకటన వాయిదా వేశామని.. రేపు ఉదయం వెల్లడిస్తామని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి… నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సి ఉందన్న ఆయన.. మహిళలకు కూడా 50 శాతం పదవులు ఇస్తున్నాం.. కసరత్తులో కొంత అలస్యం అయ్యిందన్నారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సజ్జల.. పార్టీకోసం ముందు నుంచి పని చేస్తున్న వారు, సామాజిక న్యాయం అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్ పదవుల ఎంపిక జరిగిందని.. సామాజిక న్యాయం, మహిళలకు పెద్దపీట వేయాలనే విధానం వల్ల కసరత్తుకు ఎక్కువ సమయం పడుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం పదవులు, మహిళలకు 50 శాతం పదవులు ఉంటాయన్న ఆయన.. ప్రజలతో మమేకం అయినవారికే ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు.. ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా కొన్ని కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రయత్నం చేశామన్న ఆయన.. జిల్లా స్థాయి వరకు అన్ని కార్పొరేషన్లు కలుపుకుంటే సంఖ్య వందకు పైనే ఉంటుందన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-