ప్రైమ్ లో ‘సైనా’

ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ గా తెరకెక్కింది ‘సైనా’. ఈ ఏడాది విడుదలైన అతి తక్కువ బాలీవుడ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. నిజానికి గతేడాది ద్వితీయార్ధంలో విడుదల చేయానుకున్నా లాక్ డౌన్ వల్ల చివరికి ఈ ఏడాది మార్చి 26న విడుదలైంది. పరిణితి చోప్రా సైనా నెహ్వాల్ గా, మనవ్ కౌల్ పుల్లెల గోపీచంద్ గా, ఇషాన్ నక్వీ పారుపల్లి కశ్యప్ గా కనిపించి సందడి చేశారు. ‘తారే జమీన్ పర్’ దర్శకుడు అమోల్ గుప్తా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఉత్తరాదిన థియేటర్లలో 50 పర్సెంట్ రూల్ అమలులో ఉండటంతో అది సినిమాపై ప్రభావం చూపించింది. అయితే స్పోర్ట్‌ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు థియేటర్లలో చూడటం మిస్ అయితే ఇప్పుడు ఓటీటీలో వీక్షించే అవకాశం లభించనుంది. ప్రైమ్ వీడియోలో ‘సైనా’ను ఈరోజు నుంచి
చూడవచ్చు. ఇంకెందుకాలస్యం మరి చూసేయండి.

Related Articles

Latest Articles

-Advertisement-