ముద్దు సీన్‌పై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు

‘లవ్ స్టోరీ’ సక్సెస్ ను చిత్రబృందం ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే సక్సెస్ మీట్ కూడా విజయవంతగా జరుపుకోగా.. చిత్రబృందం పలు ఇంటర్వ్యూలతో మూవీ విశేషాలను పంచుకుంటున్నారు. అయితే తాజాగా కథానాయిక సాయిపల్లవి లవ్ స్టోరీ సినిమా గూర్చి మాట్లాడుతూ.. ముద్దు సన్నివేశంపై చెప్పుకొచ్చింది.

‘ముద్దు సన్నివేశాల్లో నేనేప్పుడు న‌టించ‌లేదు. సినిమాకు డేట్స్‌ ఇచ్చేటప్పుడే డైరెక్టర్లతో ఈ విషయంలో క్లియర్ గా ఉంటాను. తనకు ఇష్టంలేని పనిని శేఖర్ కమ్ముల చేయించలేదని తెలిపింది. సినిమాలో నాగచైతన్యను తాను ముద్దు పెట్టుకోన్న సీన్ కెమెరామెన్ ట్రిక్ అని తెలియజేసింది. తాను ఎప్పుడూ ముద్దు సన్నివేశాల్లో నటించనని సాయిపల్లవి మరోసారి తేల్చేసింది. ఇక ల‌వ్ స్టోరీ వ‌సూళ్ల ప‌రంగా కూడా నిర్మాత‌ల‌కు కాసుల పంట పండిస్తోంది. నాగ‌చైత‌న్య, సాయిప‌ల్ల‌వి న‌ట‌న సినిమాకు హైలెట్ గా నిలిచింది.

-Advertisement-ముద్దు సీన్‌పై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు

Related Articles

Latest Articles