చెర్రీ – శంకర్ మూవీకి బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్

‘కృష్ణం వందే జగద్గురుమ్’కు అద్భుతమైన సంభాషణలు రాసి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్న బుర్రా సాయిమాధవ్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కంచె, గోపాల గోపాల’ వంటి చిత్రాలకూ చక్కని సంభాషణలు రాసిన సాయిమాధవ్, నందమూరి బాలకృష్ణ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి, ఎన్టీయార్ కథానాయకుడు, మహానాయకుడు’; చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150, సైరా’ చిత్రాలకూ మాటలు రాసి తాను స్టార్ హీరోలకూ రచన చేయగలనని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్, శాకుంతలం, ప్రభాస్ – నాగఅశ్విన్’ చిత్రాలకు బుర్రా సాయిమాధవ్ సంభాషణలు రాస్తున్నారు.

Read Also : ఆర్య ఎపిక్ మూవీ “సర్పట్ట” ట్రైలర్

విశేషం ఏమంటే… రామ్ చరణ్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాకూ ఆయనే సంభాషణలు రాస్తున్నారు. ఇటీవల చెన్నయ్ వెళ్ళి శంకర్ ను స్వయంగా కలిశారు బుర్రా సాయిమాధవ్. ” ‘జెంటిల్ మేన్’ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓ ఫోటో దిగితే ఈ జీవితానికి చాలనుకున్నాను. ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను” అంటూ సోషల్ మీడియా ద్వారా తన హర్షాన్ని వ్యక్తం చేశారు. అందుకు కారకులైన దిల్ రాజు, చరణ్‌ కు కృతజ్ఞతలు తెలిపారు బుర్రా సాయిమాధవ్. ‘ఇండియన్ -2’కు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఇప్పుడు శంకర్ – రామ్ చరణ్ మూవీకి మార్గం సుగమం అయ్యింది. అతి త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-