మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సాయిధరమ్ తేజ్ ట్వీట్

మెగా హీరో సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని కుటుంబ సభ్యులు, ఆసుపత్రి బృందం చెబుతున్న ఫ్యాన్స్ కాస్త నిరాశే వ్యక్తం చేశారు. కనీసం ఓ ఫోటోనైన షేర్ చేయొచ్చుగా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా దీనిపైనా సాయిధరమ్ తేజనే సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘నాపై మరియు నా చిత్రం “రిపబ్లిక్” పై మీ ప్రేమ, ఆప్యాయతను చూపించినందుకు నా కృతజ్ఞతలు.. త్వరలోనే కలుద్దాం’ అంటూ సాయిధరమ్ తేజ్ తన చేతి సంజ్ఞతో కోలుకున్నాను అనే సంకేతం పంపించారు.

సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా నుంచి చాలా రోజుల తర్వాత సడన్ గా వచ్చిన పోస్టుతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తంచేస్తున్నారు. దీంతో సాయితేజ్ పూర్తిగా కోలుకున్నట్లుగానే అర్థమైపోతుంది. మరో వారం రోజుల్లో డిశ్చార్జ్ అవుతున్నట్లుగా సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఈరోజు ఉదయం మీడియా ఇంటరాక్షన్ లో తెలియచేశాడు.

సాయి ధరమ్ తేజ్ నటించిన రాజకీయ డ్రామా ‘రిపబ్లిక్’ 1 న విడుదలై విజయవంతంగా నడుస్తోంది. మరోవైపు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ‘కొండపొలం’ విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా, సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురయ్యాడు. మాదాపూర్ పోలీసులు సాయి ధరమ్ తేజ్‌పై అతివేగం కేసు నమోదు చేశారు. యాక్సిడెంట్ లో ఆయన కాలర్ బోన్‌లో ఫ్రాక్చర్ అయ్యింది. పలు శస్త్ర చికిత్సల అనంతరం సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కోలుకుంటున్న ఆయన త్వరలోనే అభిమానుల ముందుకు రానున్నారు.

-Advertisement-మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సాయిధరమ్ తేజ్ ట్వీట్

Related Articles

Latest Articles