కంగారు అవసరం లేదు.. తేజ్ సేఫ్ : అల్లు అరవింద్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ ఘోర యాక్సిడెంట్ కు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా తేజ్ ఆరోగ్యంపై నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. “నిన్న రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. ప్రస్తుతం అతనికి ఎలాంటి ప్రమాదం లేదు. క్షేమంగా ఉన్నాడు. నేను వైద్యుల దగ్గర మాట్లాడి మీ దగ్గర ఈ మాట చెబుతున్నాను. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం విషయంలో కంగారు అవసరం లేదు. తలకు గానీ.. శరీరంలో మారెక్కడా ఇంటర్నల్ బ్లీడింగ్ లేదని వైద్యులు తెలిపారు. రేపు ఉదయం జనరల్ వార్డుకు తీసుకొస్తారని, సాధారణంగా మాట్లాడతాడని వైద్యులు నాతో చెప్పారు. మీడియాలో ఏవేవో వార్తలు రాకుండా ఫ్యామిలీ నుంచి ఒకరు వచ్చి చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. మళ్లీ చెప్తున్నాను సాయి ధరమ్ తేజ్ క్షేమంగా ఉన్నాడు” అని అపోలో దగ్గర మీడియాకు వెల్లడించారు అల్లు అరవింద్.

Read Also : సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు

కాగా సాయి ధరమ్ తేజ్ అతివేగం వల్లే ఈ ప్రమాదానికి గురైనట్టు పోలిసుల ప్రాథమిక విచారణలో వెల్లడింది. అపోలో డాక్టర్ ఆలోక్ రంజన్ మాట్లాడుతూ “సాయి ధరమ్ తేజ్ కు సిటీ స్కాన్ చేసాం. ఐసీయూలో ఉన్నారు. మేజర్ ఇంజురిస్ లేవు. అన్ని రకాల టెస్టులు చేశాము. అవసరాన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ కు అయినా మేం సిద్ధంగా ఉన్నాం. కాలర్ బోన్ ప్రాక్చర్ అయింది. 48 గంటలు పర్యవేక్షణలో ఉంటారు” అని తెలిపారు. ప్రస్తుతం తేజ్ కు శ్వాసకు సంబంధించి ఎలాంటి సమస్యలు రాకుండా చికిత్స అందిస్తన్నట్టు సమాచారం.

Related Articles

Latest Articles

-Advertisement-