స్పృహలోకి వచ్చిన సాయిధరమ్ తేజ్

టాలీవుడ్ ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ కి రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు.. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ – 45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్ నుంచి ఆయన కిందపడ్డారు.. తీవ్రగాయాలు కావడంతో సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అయితే చికిత్స అనంతరం సాయి తేజ్ స్పృహలోకి వచ్చారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. కేబుల్ బ్రిడ్జి దాటాక కోహినూర్ హోటల్ సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ నుంచి ఒక్కసారిగా కిందపడ్డారు. అనంతరం స్థానికులు, పోలీసులు ఆయనను మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆయన కుడికన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్ర గాయాలైయ్యాయి. బైక్ ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు తెలుస్తోంది.

Related Articles

Latest Articles

-Advertisement-