ఇసుక వల్లనే ప్రమాదం.. జీహెచ్ఎంసీ పైన కేసు : రాయదుర్గం సీఐ

సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై రాయదుర్గం సీఐ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… సమాచారం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజీని సేకరించాము. ఐపీసీ సెక్షన్లతో పాటు మోటార్ వేహికిల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసాము.ఐపీసి సెక్షన్లు 336, 279 లతో పాటు మోటార్ వేహికిల్ యాక్ట్ 184 కింద కేసు నమోదు చేసాము. తేజ్ ప్రయాణం చేసిన బైక్ స్పీడ్ ను ఎస్టిమేట్ చేస్తున్నాం. సీసీ కెమెరా ఫూటేజీలతో పాటు అందులో రికార్డైన టైం ఆధారంగా వేహికిల్ స్పీడ్ అంచనా వేస్తున్నాం. ప్రమాదానికి ముందు ఉన్న సీసీ ఫూటేజీ… ప్రమాదం జరిగనప్పుడు సీసీ ఫూటేజీలో రికార్డైన టైం ఆధారంగా బండి స్పీడ్ ను అంచనా వేయవచ్చు అని తెలిపారు. అయితే రోడ్డు పై ఇసుకను తొలగించకపోవడం వల్లనే ప్రమాదం జరిగింది అని… ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జీహెచ్ఎంసీ పైన కేసు నమోదు చేస్తాం అని పేర్కొన్నారు సీఐ రాజగోపాల్ రెడ్డి.

Related Articles

Latest Articles

-Advertisement-