సంచలన నిర్ణయం తీసుకున్న సచిన్.. నిరాశలో అభిమానులు

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కరోనా కారణంగా త్వరలో ప్రారంభం కానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. జనవరి 20 నుంచి 29 వరకు ఒమన్‌ వేదికగా జరగనున్న లెజెండ్స్‌ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా మహరాజాస్ జట్టు తరఫున సచిన్‌ బరిలోకి దిగాల్సి ఉంది. అయితే ఈ లీగ్‌లో ఆడనని సచిన్ చెప్పడంతో క్రికెట్ అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.

Read Also: ఐసీసీ అవార్డు రేసులో టీమిండియా యువ క్రికెటర్

కాగా లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ బరిలోకి దిగబోతున్నారు. ఈ టోర్నీలో ఇండియా మహరాజాస్‌ జట్టుతో పాటు ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ జట్లు పొల్గొంటున్నాయి. ఆసియా లయన్స్ తరఫున ఆసియా క్రికెటర్లు ఆఫ్రిది, జయసూర్య, షోయబ్ అక్తర్, మురళీధరన్… వరల్డ్ జెయింట్స్ తరఫున అవుటాఫ్ ఆసియా క్రికెటర్లు జాంటీ రోడ్స్, షేన్ వార్న్, షాన్ పొలాక్, బ్రియాన్ లారా వంటి ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.

Related Articles

Latest Articles