ప్రియుడిని పెళ్లాడిన ‘సాహో’ బ్యూటీ

ప్రభాస్ “సాహో” చిత్రంలో జెన్నిఫర్ పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఎవెలిన్ శర్మ తాజాగా తన ప్రియుడిని పెళ్లాడింది. తన చిరకాల ప్రియుడు డాక్టర్ తుషాన్ భిండితో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ఈ ఇండో-జర్మన్ నటి ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. వీరి వివాహం ఆత్మీయుల మధ్య ఆస్ట్రేలియాలో జరిగినట్టు తెలుస్తోంది. ఎవెలిన్ శర్మ, డాక్టర్ తుషాన్ భిండి 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థానికి ముందు ఒక ఏడాదికి పైగా వీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. తుషాన్ ఆస్ట్రేలియాలో డెంటల్ సర్జన్ గా పని చేస్తున్నారు. నిశ్చితార్థం జరిగినప్పటి నుండి ఎవెలిన్ ఆస్ట్రేలియాలోనే ఉంటోంది. ఇక ఈ బ్యూటీ తన పెళ్లి గురించి మాట్లాడుతూ “బెస్ట్ ఫ్రెండ్‌ను వివాహం చేసుకోవడం కంటే మంచి అనుభూతి లేదు. మా జీవితాన్ని కలిసి గడపడం పట్ల మేము చాలా సంతోషిస్తున్నాము” అంటూ తన పెళ్లిపై సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ఎవెలిన్ శర్మ-తుషాన్ భిండి పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-