దేవుడు స్వయంగా కూర్చొని చెక్కిన సింగిల్ పీస్ పవన్ కళ్యాణ్- ఎస్.జె సూర్య

‘వాలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు ఎస్.జె సూర్య.. ‘ఖుషీ’ చిత్రంతో టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి తిరుగులేని హిట్ ని ఇచ్చి పవన్ ఫ్యాన్స్ కి దేవుడిగా మారాడు. ఇక ఈ సినిమాలో నటుడిగా కూడా కనిపించిన ఈ దర్శకుడు ప్రస్తుతం నటుడిగానే కొనసాగుతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మానాడు’ చిత్రంలో సూర్య విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘లూప్’ పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సూర్య ఆయన దర్శకత్వంలో పనిచేసిన టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తెలుగులో ఎస్.జె సూర్య పవన్ కళ్యాణ్ కాంబోలో ‘ఖుషీ’, ‘కొమరం పులి’ చిత్రాలు రాగా, మహేష్ తో ‘నాని’ చిత్రాన్ని తెరకెక్కించాడు. దర్శకుడిగా వారితో కలిసి ట్రావెల్ చేసినందుకు చాలా ఆనందపడుతున్నాని తెలిపిన ఆయన వారి స్వభావాల గురించి చెప్పుకొచ్చాడు. ” పవన్ కళ్యాణ్ విషయానికొస్తే ఆయన చాలా స్పెషల్ అని చెప్పాలి. దేవుడు స్వయంగా కూర్చొని తయారుచేసిన సింగిల్ పీస్ పవన్ అని చెప్పాలి.. ఆయన ఏదైనా అనుకుంటే అది వెంటనే జరిగిపోవాలి అని చెప్పారు. ఇక మహేష్ గురించి మాట్లాడుతూ” మహేష్ తన మనసుకు నచ్చిన పని చేయడానికి కొంత ఆలోచిస్తారు. కొంత సమయం తీసుకుంటారు.. అదే నేను వారిద్దరి మధ్య గమనించిన తేడా అంటూ చెప్పుకొచ్చారు. ఇక కోలీవుడ్ విషయానికొస్తే పవన్ ని అజిత్ తోను.. మహేష్ ని విజయ్ తోను పోలుస్తా అని తెలిపారు.

Related Articles

Latest Articles