డీసీ కామిక్స్, మార్వెల్ మూవీస్… రెండు చోట్లా లక్కీ ఛాన్స్ లు కొట్టేసిన స్టార్స్

‘తోర్ : లవ్ అండ్ థండర్’ సినిమాలో కనిపించబోతున్నాడు హాలీవుడ్ సూపర్ స్టార్ రసెల్ క్రోవే. అయితే, ‘తోర్’ మార్వెల్ వారి మూవీ కాగా… ‘జస్టిస్ లీగ్’ సినిమా డీసీ వారి చిత్రం. రసెల్ క్రోవే అందులోనూ నటించాడు. కాకపోతే, డీసీ అండ్ మార్వెల్ మూవీస్ రెండిట్లోనూ నటించిన యాక్టర్స్ గతంలోనూ కొందరున్నారు. వారెవరో చూసేద్దాం పదండీ…

క్రిస్టఫర్ నోలాన్ ‘ద డార్క్ నైట్’ ట్రయాలజీలో బ్యాట్ మాన్ గా కనిపించాడు క్రిస్టియన్ బాలే. అతనే నెక్ట్స్ ‘తోర్ : లవ్ అండ్ థండర్’లోనూ అలరించబోతున్నాడు.

రయాన్ రెనాల్డ్స్ ‘డెడ్ పూల్’ ఫ్రాంఛైజ్ మూవీస్ లో ప్రధాన పాత్రని పోషించాడు. అతనే 2011లో వచ్చిన డీసీ ఫిల్మ్ ‘గ్రీన్ లాంటర్న్’లో హీరోగా మెప్పించాడు.

‘ద డార్క్ నైట్ రైసెస్’ సినిమాలో టామ్ హార్డీ మాస్క్ ధరించే డేంజరస్ విలన్ గా ఆశ్చర్యపరిచాడు. తరువాత ఆయనే మార్వెల్ ఫిల్మ్ అయిన ‘వెనోమ్’లోనూ కీలక పాత్ర పోషించాడు.

‘స్పైడర్ మ్యాన్’ సినిమాలో డైలీ న్యూస్ పేపర్ ఎడిటర్ గా కనిపించాడు జేకే సిమోన్స్. ఆయన ‘జస్టిస్ లీగ్’ సినిమాల్లోనూ కనిపించాడు. కమీషనర్ జేమ్స్ గోర్డాన్ గా 2016, 2021 ‘జస్టిస్ లీగ్’ మూవీస్ సీక్వెల్స్ లో మెప్పించాడు.

‘ఎక్స్ మెన్ ఆరిజిన్స్’ సినిమాలో జనరల్ విలియమ్ స్ట్రైకర్ గా నటించాడు డానీ హూస్టన్. ‘వండర్ ఉమన్’ సినిమాలోనూ జర్మన్ పొలిటీషన్ గా ప్రతిభని చాటుకున్నాడు. ‘ఎక్స్ మెన్ ఆరిజిన్స్’ మార్వెల్ మూవీ కాగా ‘వండర్ ఉమన్’ డీసీ కామిక్స్ లోనిది.

‘స్ట్రామ్’ అనే పాత్రతో ‘ఎక్స్ మెన్’, ‘ఎక్స్ 2’ చిత్రాల్లో నటించింది హాలీ బెర్రీ. 2004లో విడుదలైన ‘క్యాట్ ఉమన్’లోనూ ఆమె అలరించింది.

బెన్ అఫ్లెక్, టావో ఒకమోటో, విల్లెమ్ డఫోయ్, మైకెల్ కీటన్…. ఇలా ఇంకా చాలా మందే ఉన్నారు అటు మార్వెల్, ఇటు డీసీ చిత్రాల్లో నటించిన వారు. సూపర్ హీరోల సినిమాల్లో సూపర్ క్యారెక్టర్స్ చేసిన వీరంతా హాలీవుడ్ సినిమాలు రెగ్యులర్ గా చూసే వారికి హాట్ ఫేవరెట్సే!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-